![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.
అది చూసి రుద్ర షాక్ అవుతాడు. నన్ను మోసం చేసావ్ గంగ.. ఆ రోజు ఫొటోస్ తీసి నువ్వే సోషల్ మీడియాలో పెట్టావ్ లేదంటే ఇది ఇక్కడ ఎందుకు ఉంటుందని రుద్ర అంటాడు. అసలు అదేంటో కూడా నాకు తెలియదని గంగ అంటుంది. ఇంట్లో అందరు వచ్చి.. ఏంటి గొడవ అంటారు. నేను గంగ కెరీర్ కోసం తనని పెళ్లి చెసుకున్నాను కానీ ఇంత మోసం చేసిందని తెలిసాక ఇక నాకు అవసరం లేదు.. నువ్వు ఇక్కడే ఉండిపోమని చెప్పి రుద్ర వెళ్లిపోతాడు. దాంతో లక్ష్మి కిందపడిపోతుంది. తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంటే.. రుద్ర చూసి అసలు గంగ వాళ్ల అమ్మకి ఏమైంది.. వద్దని అనుకుని వచ్చాను.. ఇప్పుడు వెళ్తే బాగోదని రుద్ర అనుకుంటాడు. ప్రాబ్లమ్ గంగతో కానీ వాళ్ల అమ్మతో కాదు కదా అని మళ్ళీ అనుకుంటాడు. లక్ష్మీకి హాస్పిటల్ ఖర్చు ముప్పై వేయిలు అవుతుందని డాక్టర్ చెప్తాడు. అప్పుడే రుద్ర వచ్చి పే చేసి వెళ్తాడు. మీ మధ్యలో ఏం గొడవ అయిందో తెలియదు గానీ మీరు మళ్ళీ కలవాలని గంగతో శ్రీను అంటాడు. కలవాలంటే నేను తప్పు చెయ్యలేదని నిరూపించాలని గంగ అంటుంది.
మరొకవైపు ఇషిక, వీరులకి పారు ఫోన్ చేసి తన ప్లాన్ చెప్తుంది. ఇక గంగని రుద్ర ఎప్పటికి క్షమించడని పారు చెప్పగానే మంచి ప్లాన్ చేసావని పారుని ఆ ఇద్దరు పొగుడుతారు. తరువాయి భాగంలో రుద్ర ఒక్కడే ఇంటికి వస్తాడు. ఏమైందని పెద్దసారు అడుగగా రుద్ర జరిగింది చెప్తాడు. శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |